ప్రకృతి వ్యవసాయంతో మంచి దిగుబడి
ABN , First Publish Date - 2021-10-29T05:07:34+05:30 IST
ప్రకృతి వ్యవసాయం వలన రైతులు పండిస్తున్న పంటలకు మంచి దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

జమ్మలమడుగు రూరల్, అక్టోబరు 28: ప్రకృతి వ్యవసాయం వలన రైతులు పండిస్తున్న పంటలకు మంచి దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గురువారం జమ్మలమడుగు మండలంలోని దేవగుడి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం వద్ద స్థానిక వలంటీర్లకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు లడ్డూ ప్రసాదం కొరకు ప్రకృతి వ్యవసాయం వలన పండించిన శనగలను కొనుగోలు చేస్తారన్నారు. ప్రకృతి వనరుల ద్వారా తయారు చేసిన కషాయాలు, ద్రావణాలు రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచుతారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు డివిజన్ మాస్టర్ ట్రైనర్ లక్ష్మిదేవి, రిబక, రాణి, కుమార్‌రెడ్డి, సావిత్రి, వలంటీర్లు పాల్గొన్నారు.