మొక్కు తీర్చుకునేందుకు వెళుతూ...

ABN , First Publish Date - 2021-03-15T05:06:19+05:30 IST

ఉద్యోగం రావడంతో దేవునికి మొక్కు తీర్చుకునేందుకు వెళుతూ గోన లోకేష్‌రెడ్డి(22) ఆదివారం తెల్లవారుజామున నర్సరావుపేట వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మ రణం చెందాడు.

మొక్కు తీర్చుకునేందుకు వెళుతూ...
లోకేష్‌రెడ్డి మృతదేహం

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

బ్రహ్మంగారిమఠం, మార్చి 14:  ఉద్యోగం రావడంతో దేవునికి మొక్కు తీర్చుకునేందుకు వెళుతూ గోన లోకేష్‌రెడ్డి(22) ఆదివారం తెల్లవారుజామున నర్సరావుపేట వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మ రణం చెందాడు. బ్రహ్మంగారి మ ఠం మండలం తోట్లపల్లె మాజీ సర్పంచి గోన ప్రతాప్‌ రెడ్డి కుమా రుడు లోకేష్‌రెడ్డి చేసిన కృషి ఫలించడంతో  పోస్టల్‌లో ఉద్యోగం వచ్చింది.

దీంతో అమ్మవారికి మొక్కు తీర్చుకునేందుకు మిత్రుడితో కలిసి విజయవాడకు బైకులో బయలు దేరాడు. ఆదివారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా నర్సరావుపేట వద్ద బైకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. దీంతో గాయపడిన లోకేష్‌రెడ్డి, మిత్రున్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి చికిత్స పొందుతూ లోకేష్‌ మృతి చెందాడు. కాగా తోటి మిత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చేతికందిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పడగం డ్లలో పోస్టల్‌ డిపార్టుమెంట్‌లో బ్రాంచ పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.  విష యం తెలుసుకున్న రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పరామర్శించారు. టీడీపీ మండల కన్వీనర్‌ చెన్నుపల్లె సుబ్బారెడ్డి, టీడీపీ నేతలు పరామర్శించారు.

Updated Date - 2021-03-15T05:06:19+05:30 IST