వైభవంగా గోదాదేవి కల్యాణం

ABN , First Publish Date - 2021-01-14T04:43:22+05:30 IST

సౌమ్యనాథస్వామి ఆలయంలో బుధవారం ఉదయం భోగి పండుగను పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

వైభవంగా గోదాదేవి కల్యాణం

నందలూరు, జనవరి13 : సౌమ్యనాథస్వామి ఆలయంలో బుధవారం ఉదయం భోగి పండుగను పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల గోవిందనామస్మరణలతో కల్యాణతంతు నిర్వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు అరిగెల సౌమిత్రి చంద్రనాథ్‌, ఈవో సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో కడపకు చెందిన రేవనూరు రాంప్రసాద్‌, జ్యోతి దంపతులు ఉభయదారులుగా కన్నుల పండువగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-01-14T04:43:22+05:30 IST