వైభవంగా వాసవీమాత జయంతి

ABN , First Publish Date - 2021-05-22T04:52:04+05:30 IST

వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం లో శుక్రవారం అమ్మవారి జయంతి వేడుకలను వైభంగా నిర్వహించారు.

వైభవంగా వాసవీమాత జయంతి
హోమం నిర్వహిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, మే 21: వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం లో శుక్రవారం అమ్మవారి జయంతి వేడుకలను వైభంగా నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారి మూలవిరాట్‌కు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి సుందరంగా అలంకరించారు.  పూజల అనంతరం లోకకల్యాణార్థం గణపతి, నవగ్రహ, శాంతి, రుద్ర, చండీహోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కరోనా నిబంధనలు అనుసరిస్తూ అమ్మవారి జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షులు రామమోహన్‌రావు, ఉపాధ్యక్షులు రవీంద్రబాబు, కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-22T04:52:04+05:30 IST