ఘనంగా రాజీవ్‌ గాంధీ జయంతి

ABN , First Publish Date - 2021-08-21T04:51:12+05:30 IST

భారతరత్న స్వర్గీయ రాజీవ్‌ గాంధీ జయంతి ఉత్సవాలను కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావుతో కలసి రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా రాజీవ్‌ గాంధీ జయంతి

కడప(కలెక్టరేట్‌), ఆగస్టు 20: భారతరత్న స్వర్గీయ రాజీవ్‌ గాంధీ జయంతి ఉత్సవాలను కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావుతో కలసి రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అనంతరం ఇందిరానగర్‌లోని వృద్ధాశ్రమంలో మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శ్యామలాదేవి ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షుడు మామిళ్లబాబుతో కలిసి డీసీసీ కార్యాలయంలో రక్తదానశిబిరం నిర్వహించారు. 


యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రన్‌ఫర్‌ నేషన్‌

యువజన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెప్పలి పుల్లయ్య ఆధ్వర్యంలో శుక్రవారం రన్‌ ఫర్‌ నేషన్‌ (ఒక కిలో మీటరు పరుగు) కార్యక్రమం నగరంలో జరిగింది. యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డిలు హాజరయ్యారు. కార్యక్రమం అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి కొత్త కలెక్టరేట్‌ మహావీర్‌ సర్కిల్‌ వరకు సాగింది. 

Updated Date - 2021-08-21T04:51:12+05:30 IST