సీఎ్‌సఐ చర్చిలో ఘనంగా ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-20T04:58:21+05:30 IST

కడప నగరం సీఎ్‌సఐ చర్చిలో ప్రముఖ జ్యోతిష్యుడు ఎం.సురే్‌షబాబు ఆధ్వర్యంలో సండే స్కూల్‌ విద్యార్థుల మధ్య ఘనంగా ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు.

సీఎ్‌సఐ చర్చిలో ఘనంగా ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు

కడప(ఎర్రముక్కపల్లె), డిసెంబరు 19: కడప నగరం సీఎ్‌సఐ చర్చిలో ప్రముఖ జ్యోతిష్యుడు ఎం.సురే్‌షబాబు ఆధ్వర్యంలో సండే స్కూల్‌ విద్యార్థుల మధ్య ఘనంగా ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సురే్‌షబాబు మాట్లాడుతూ సర్వమానవాళి రక్షణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు భూమిపై అవతరించారన్నారు. ప్రేమ శాంతి సేవ తత్వాలను బోధించాడని చెప్పారు. క్రీస్తు సూచించిన మార్గంలో ప్రజలందరూ నడవాలని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాస్టర్‌ విక్టర్‌రాజు, స్నేహలత, సీఎ్‌సఐ కార్యదర్శి రంజన్‌, కోశాధికారి దేవకుమారి, బాషామొయిద్దీన్‌, నయీమ్‌, సుందరరాజు తదితరులు పాల్గన్నారు. 

Updated Date - 2021-12-20T04:58:21+05:30 IST