ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-26T05:30:00+05:30 IST

సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పార్టీ జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరిస్తున్న సీపీఐ నాయకులు

కడప(రవీంద్రనగర్‌), డిసెంబరు 26: సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సీపీఐ పతాక ఆవిష్కరణలు చేపట్టారు. బ్రిటీష్‌ పాలకుల నిర్భంద కాండకు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1925వ సంవత్సరం డిసెంబరు 26న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్‌పూర్‌ గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. కార్యక్రమంలో మద్దిలేటి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణమూర్తి, సుబ్రమణ్యం, చంద్రశేఖర్‌, విజయలక్ష్మి, నాగసుబ్బారెడ్డి, ఏవీ.రమణ, మనోహర్‌రెడ్డి, సావంత్‌సుధాకర్‌, వేణుగోపాల్‌, కేసి.బాదుల్లా, మునయ్య, శంకర్‌నాయక్‌, బ్రహ్మం, ఓబులేసు, నాగార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


పోరాటాలకు సిద్ధం కండి : వేణుగోపాల్‌

దేశంలో బీజేపీ అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, మహిళా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు గుంటి వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఎర్రముక్కపల్లెలో సీపీఐ 97వ ఆవిర్భావం పురస్కరించుకొని జెండా ఆవిష్కరించారు. 


ఆలంఖాన్‌పల్లెలో: 

నగరంలోని ఆలంఖాన్‌పల్లెలో సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు కర్నాటి చెంచయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెయిన్‌రోడ్డులో పార్టీ సీనియర్‌ నాయకుడు వల్లెపు సుబ్బన్న చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం కె.సుబ్బన్న పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు సోమవారపు సుబ్బరాయుడు, సీపీఐ శాఖ కార్యదర్శి పి.నాగరాజు, కె.నరసింహారావు, శాంతమ్మ, పి.సుబ్బరాయుడు, సుబ్బమ్మ, రెడ్డయ్య, పోతులూరయ్య, పెంచలనర్సయ్య, అరుణ్‌కుమార్‌, ఓబులేసు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T05:30:00+05:30 IST