ఘనంగా భగీరథ మహర్షి జయంతి

ABN , First Publish Date - 2021-05-20T05:23:59+05:30 IST

మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రాణికోటి కష్టాలు తీర్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని సగర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గానుగపెంట రమణమ్మ పేర్కొన్నారు.

ఘనంగా భగీరథ మహర్షి జయంతి
భగీరఽథుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌ / ప్రొద్దుటూరు క్రైం, మే 19: మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రాణికోటి కష్టాలు తీర్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని సగర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గానుగపెంట రమణమ్మ పేర్కొన్నారు. భగీరథ మహర్షి జయంతిని పురష్కరించుకుని బుధవా రం శివాలయం సెంటర్‌లో ఆయన చిత్రపటానికి సగర సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భగీరథ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడానికి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పేదలు, మున్సిపల్‌ కార్మికులకు సంఘం ఆధ్వర్యంలో భోజన పొట్లాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సగర సంఘం జిల్లా అధ్యక్షుడు మజ్జారి వీరమోహన్‌, సగర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఉప్పర మురళీధర్‌, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాలగంగాధర్‌ తిలక్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యానిక సుబ్బారావు, సగర సంఘం జిల్లా కోశాధికారి జోదు కృష్ణప్రసాద్‌, కార్యదర్శి ఈశ్వరయ్య, కొత్తపల్లె సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సగర (ఉప్పర) సంఘం జిల్లా అధ్యక్షుడు మాదాసు మురళీ ఆధ్వర్యంలో బుధవారం ఆయన తన నివాసం వద్ద సంఘం సభ్యులతో కలిసి భగీరధ మహార్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భగీరధ మహార్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళు ల్పించారు. సగర జేఏసీ పొగ్రామింగ్‌ కమిటీ చైర్మన్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-20T05:23:59+05:30 IST