ఘనంగా సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి

ABN , First Publish Date - 2021-11-01T05:09:13+05:30 IST

భారత తొలి హోంశా ఖా మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్‌ 146వ జయంతి వేడుకలను రామేశ్వరంలోని బాలబాలికల గ్రంథాలయం లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి
పటేల్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, అక్టోబరు 31: భారత తొలి హోంశా ఖా మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్‌ 146వ జయంతి వేడుకలను రామేశ్వరంలోని బాలబాలికల గ్రంథాలయం లో  ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చైతన్య సాంఘిక సేవ సంఘం అధ్యక్షుడు కరుమూరి వెంకటరమణయ్య మట్లాడుతూ స్వదేశీ సంస్థానాలను ఆయన ఉక్కు సంకల్పంతో దేశంలో విళీనం చేశారని అన్నారు. ఆయన స్వాతంత్రోధ్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించి 1991లో కేంద్ర ప్రభు త్వం భారతరత్న బిరుదును ప్రదానం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్‌ ఇబ్రహీంసాహెబ్‌, సుబ్బరాయుడు, శ్రీనివాసులరెడ్డి, జోగయ్య, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-01T05:09:13+05:30 IST