గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచర్ల

ABN , First Publish Date - 2021-09-15T05:12:56+05:30 IST

గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు 138వ జయంతి వేడుకలను రామేశ్వరంలోని బాలబాలికల గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాల వే సి నివాళులు అర్పించారు.

గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచర్ల
గాడిచర్ల చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌/అర్బన్‌, సెప్టెంబరు 14: గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు 138వ జయంతి వేడుకలను రామేశ్వరంలోని బాలబాలికల గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాల వే సి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైతన్యసాంఘిక సేవా సంఘం అధ్యక్షుడు కరుమూరి వెంకటరమణ మాట్లాడుతూ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు  గ్రంథాలయాల కోసం ఆయన అనేక రచనలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం రికార్డు అసిస్టెంట్‌ ఇబ్రహీంసాహెబ్‌, శివకేశవులు, కొండయ్య, రవిచంద్ర, శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. స్థానిక శ్రీరాముల పేటలోని ఉపాధ్యాయసేవాకేంద్రంలో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జయంతిని సంస్కృతి స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, సాహితీ మిత్రులు కోట ఓబులరెడ్డి, రామానుజరెడ్డి, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

జమ్మలమడుగులో (రూరల్‌): జమ్మలమడుగు ప్రభుత్వ శాఖ గ్రంథాలయంలో మంగళ వారం ఆంధ్రాతిలక్‌ గాడిచర్ల హరిసర్వోత్తమ 138వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అధికారి జింకా చంద్రశేఖర్‌, పాఠకులు, సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది నరసమ్మ, పాఠకులు సుబ్రహ్మణ ్యం, అశోక్‌, గైబూవలి, సత్యనారాయణరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-15T05:12:56+05:30 IST