పెన్షన్‌ విద్రోహ దినంకు సంపూర్ణ మద్దతు

ABN , First Publish Date - 2021-08-28T05:18:33+05:30 IST

సెప్టెంబరు 1న తలపెట్టిన పెన్షన్‌ విద్రోహ దినానికి రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తరపున సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు ఎస్‌ఎల్‌టీఏ కడప జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి అనీషాబేగం పేర్కొన్నారు.

పెన్షన్‌ విద్రోహ దినంకు సంపూర్ణ మద్దతు

గోపవరం, ఆగ స్టు 27 : సెప్టెంబరు 1న తలపెట్టిన పెన్షన్‌ విద్రోహ దినానికి రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తరపున సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు ఎస్‌ఎల్‌టీఏ కడప జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి అనీషాబేగం పేర్కొన్నారు. శనివారం ఆమె రాచాయిపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్‌ ఇప్పటికే ఎందరో ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలను కాటేసిందని,దీన్ని అంతం చేసి పాత పెన్షన్‌ విధానం సాధించుకోవాల్సిన బాధ్యత ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉందన్నారు.  ఉద్యోగులందరూ సంఘటితంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు.  

Updated Date - 2021-08-28T05:18:33+05:30 IST