ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు ఉదయం రెండు బస్సులు

ABN , First Publish Date - 2021-07-13T05:02:06+05:30 IST

ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరు కాలేజీలకు వెళ్లే విద్యార్థుల కోసం రోజూ ఉదయం రెండు బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ప్రొద్దుటూరు టీపో మేనేజర్‌ మధుశేఖర్‌రెడ్డి ‘ ఆంధ్రజ్యోతికి ’ కి తెలిపారు.

ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు   ఉదయం  రెండు బస్సులు

ఎర్రగుంట్ల, జూలై 12: ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరు కాలేజీలకు వెళ్లే విద్యార్థుల కోసం రోజూ ఉదయం రెండు బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ప్రొద్దుటూరు టీపో మేనేజర్‌ మధుశేఖర్‌రెడ్డి ‘ ఆంధ్రజ్యోతికి ’ కి తెలిపారు. సోమవారం ‘ బస్సుల్లేక విద్యార్థినుల ఇక్కట్లు ’ అనే వార్త ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన డీఎం మధుశేఖర్‌రెడ్డి విద్యార్థినులు ఇబ్బందులు పడకుండా రోజూ ఉదయం 6.30గంటలకు, 7.30గంటలకు ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండు నుంచి బస్సుఉలు బయలుదేరేవిధంగా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులతో పాటు, ప్రొద్దుటూరుకు ఉదయా న్నే వెళ్లే వారు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రైల్వే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్ని బస్సులు కూడా రైల్వేస్టేషన్‌ మీదుగా పోయేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-07-13T05:02:06+05:30 IST