దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు

ABN , First Publish Date - 2021-11-09T05:57:32+05:30 IST

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అమర్చేందుకు ప్రొద్దుటూరులో ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు. మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆలిండియా జైన్‌ యూత్‌ ఫెడరేషన్‌ మహవీర్‌లింబ్‌ సెంటర్‌ సహకారంతో సోమవారం పీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో

దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు
కృత్రిమ కాలు అమర్చడానికి కొలతలు తీసుకుంటున్న దృశ్యం

ప్రొద్దుటూరులో శిబిరం.. నేడు కూడా
ప్రొద్దుటూరు టౌన్‌, నవంబరు 8:
దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అమర్చేందుకు ప్రొద్దుటూరులో ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు. మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆలిండియా జైన్‌ యూత్‌ ఫెడరేషన్‌ మహవీర్‌లింబ్‌ సెంటర్‌ సహకారంతో సోమవారం పీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో దివ్యాంగులకు కృత్రిమ కాలు అమర్చడానికి శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యుడు టంగుటూరు మారుతీప్రసాద్‌, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కృత్రిమ అవయవాల వలన దివ్యాంగులు వారి పనులను వారే చేసుకోవడానికి వీలవుతుందన్నారు. దాత సన్నిధి శ్రీనివాస్‌ సహకారంతో ఉచిత కృత్రిమ అవయవాల ఏర్పాటు శిబిరం ఏర్పాటు చేశామని, మంగళవారం కూడా ఈ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ శిబిరానికి 200 మంది హాజరయ్యారని, ఇంకా ఎవరైనా ఉంటే  రావచ్చని సూచించారు. కృత్రిమ అవయవాలను తయారు చేసిన తర్వాత దివ్యాంగులకు సమాచారం ఇచ్చి అమర్చుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్‌ కళావతి, అధ్యక్షుడు చిట్టెం రమేష్‌, కార్యదర్శి ప్రకాష్‌, డైరెక్టర్లు శ్రీధర్‌, ధారా సంతోష్‌, సభ్యులు మహవీర్‌ లింబ్‌సెంటర్‌ అధ్యక్షుడు మహేంద్రసింఘ్వి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:57:32+05:30 IST