వైఎస్ షర్మిల, విజయమ్మలను కలిసిన మాజీ ఎంపీపీ
ABN , First Publish Date - 2021-07-09T05:17:39+05:30 IST
మండల మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి తన అనుచరులతో కలిసి వైసీపీ గౌరవాధ్యక్షురా లు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలను గురువారం ఇడుపులపాయలో కలిశారు.

మైలవరం, జూలై 8 : మండల మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి తన అనుచరులతో కలిసి వైసీపీ గౌరవాధ్యక్షురా లు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలను గురువారం ఇడుపులపాయలో కలిశారు. ఈసం దర్భంగా వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త ఏర్పాటు చేస్తున్న సందర్బంగా శుభాకాంక్షలు తెలిపినట్లు అల్లె ప్రభావతి తెలిపారు. ముందుగా దన్నవాడలోని నాలుగురోడ్ల కూడలిలో వైఎ్‌సఆర్ జయంతి సందర్బంగా వైఎ్‌సఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.