నియమాలు పాటించి... ప్రమాదాలను నివారిద్దాం
ABN , First Publish Date - 2021-01-21T05:02:42+05:30 IST
మానవ తప్పిదాల వల్లనే రోడ్డుప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి... ప్రతి ఒక్కరు రోడ్డుభద్రత నియమాలను పాటించినపుడే ప్రమాదాలు నివారించగలుగు తామని పోలీసు, రవాణాశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశా రు.

పోలీసు, రవాణాశాఖ అధికారుల పిలుపు
ప్రొద్దుటూరు క్రైం, జనవరి 20 : మానవ తప్పిదాల వల్లనే రోడ్డుప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి... ప్రతి ఒక్కరు రోడ్డుభద్రత నియమాలను పాటించినపుడే ప్రమాదాలు నివారించగలుగు తామని పోలీసు, రవాణాశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. రెండు శాఖల అధికారులు 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను బుధవారం నిర్వహించారు. డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో రూరల్ సీఐ విశ్వనాధరెడ్డి, ఎస్‌ఐ లక్ష్మినారాయణలు ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, పోలీసులతో రోడ్డుభద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ స్థానిక మైదుకూరురోడ్డులోని రిలియన్స్ పెట్రోలు బంకు నుంచి శివాలయం సర్కిల్ వరకు నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టాలంటే వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, నియమ నిబంధనలు తూచా తప్పక పాటించాలన్నారు.
నిబంధనలు పాటించకపోతే చర్యలు
వాహనచోధకులు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని ఎంవీఐ రమణ అన్నారు. బుధవారం 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురష్కరించుకుని స్థానిక ప్రాంతీయ రవాణా శాఖాదికారి కార్యాలయంలో ఆయన వాహనచోధకులకు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్గించారు. బైక్‌లు నడిపేవారికి లైసెన్స్, రికార్డులన్నీ ఉండాలన్నారు. హెల్మెట్‌ధారణ అతి ముఖ్యమన్నారు. నాలుగుచక్రాల వాహనాలు నడిపే వారు సీట్‌బెల్త్ పెట్టుకోవడం మరిచిపోకూడదన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బ ంది, వాహనచోధకులు పాల్గొన్నారు.