ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి: ఎంపీడీవో

ABN , First Publish Date - 2021-02-27T05:08:17+05:30 IST

వలంటీర్లందరూ వారికి కేటాయించిన 50 కుటుంబాల్లోని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీడీవో జాబీర్‌ అహమ్మద్‌ పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి: ఎంపీడీవో

గాలివీడు, ఫిబ్రవరి26: వలంటీర్లందరూ వారికి కేటాయించిన 50 కుటుంబాల్లోని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీడీవో జాబీర్‌ అహమ్మద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండలంలోని 17 పంచాయతీల వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి నవరత్నాలను అందించే బాధ్యత వలంటీర్లదేనన్నారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:08:17+05:30 IST