ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-22T04:57:48+05:30 IST

కడప-రాజంపేట రోడ్డులోని శనీశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

19 దుంగలు, రెండు కార్లు స్వాధీనం : ఎస్పీ అన్బురాజన్‌


కడప(క్రైం), అక్టోబరు 21 : కడప-రాజంపేట రోడ్డులోని శనీశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. 500 కేజీల బరువున్న 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజంపేట సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారి శివభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున ఒంటిమిట్ట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.హనుమంతనాయక్‌, సిద్దవటం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, సిబ్బందితో దాడులు చేసి 19 దుంగలతో పాటు ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. దుంగలు తరలించేందుకు ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. అతావుల్లాఖాన్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌, భోగపతి సందీప్‌, వీరదాసరి మహేష్‌, ఉదయగిరి ఆదినారాయణ అనే స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. దుంగలతో పాటు స్మగ్లర్లను అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. 

Updated Date - 2021-10-22T04:57:48+05:30 IST