మార్కెటింగ్ శాఖలో ఐదుగురికి పదోన్నతులు
ABN , First Publish Date - 2021-10-28T05:41:18+05:30 IST
జిల్లాలోని ఆయా మార్కెట్ కమిటీలలో కార్యదర్శుల హోదాలో పనిచేసే ఐదుగురికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో కడప మార్కెట్ కమిటీలో గ్రేడ్-2 సెక్రటరీ చంద్రమౌళికి గ్రేడ్-1 సెక్రటరీగా పదోన్నతి కల్పించి నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్ కమిటీకి వేశారు.

కడప(రూరల్), అక్టోబరు 27: జిల్లాలోని ఆయా మార్కెట్ కమిటీలలో కార్యదర్శుల హోదాలో పనిచేసే ఐదుగురికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో కడప మార్కెట్ కమిటీలో గ్రేడ్-2 సెక్రటరీ చంద్రమౌళికి గ్రేడ్-1 సెక్రటరీగా పదోన్నతి కల్పించి నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్ కమిటీకి వేశారు. మైదుకూరు మార్కెట్ కమిటీలో గ్రేడ్-3 కార్యదర్శిగా పనిచేసే మురళికి గ్రేడ్-2 కార్యదర్శిగా పదోన్నతి కల్పించి అనంతపురం జిల్లాలోని కదిరి మార్కెట్ కమిటీకి వేశారు. బద్వేల్ మార్కెట్ కమిటీలో సహాయ కార్యదర్శిగా పనిచేసే నాగిరెడ్డికి గ్రేడ్-3 సెక్రటరీగా పదోన్నతి కల్పించి ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీకి వేశారు. అలాగే రాయచోటి మార్కెట్ కమిటీలో సహాయ కార్యదర్శిగా పనిచేసే సురేంద్రకు గ్రేడ్-3 కార్యదర్శిగా పదోన్నతి కల్పించి చిత్తూరు జిల్లాలోని పీలేరు మార్కెట్ కమిటీకి వేశారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్ కమిటీలో సహాయ కార్యదర్శిగా పనిచేసే మనోహర్‌కు గ్రేడ్-3 సెక్రటరీగా పదోన్నతి కల్పించి మైదుకూరు మార్కెట్ కమిటీకి వేశారు.