వృద్ధురాలి హత్యకేసులో ఐదుగురి అరెస్టు

ABN , First Publish Date - 2021-06-23T05:09:33+05:30 IST

వృద్ధురాలి హత్యకేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయకుమార్‌ తెలిపారు.

వృద్ధురాలి హత్యకేసులో ఐదుగురి అరెస్టు
నిందితుల వివరాలు తెలుపుతున్న డీఎస్పీ

మైదుకూరు, జూన్‌ 22 : వృద్ధురాలి హత్యకేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయకుమార్‌ తెలిపారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మండలంలోని బోంచేన్‌పల్లెలో ఈనెల 9న యన్నం సుశీలమ్మ (60) పసుపు కొమ్ములు ఉడకబెట్టి ఎండటానికి సిమెంట్‌ రోడ్డుపై ఉంచింది. గ్రామానికి చెందిన దేవదాసు ట్రాక్టర్‌ను తిప్పే క్రమంలో అవి చిందరవందరయ్యాయి. దీంతో సుశీలమ్మ శాపనార్థాలు పెట్టింది. దీంతో దేవదాసు తన కుటుంబ సభ్యులైన ఉదయగిరి వినయ్‌కుమార్‌, యన్నం కరుణాకర్‌, యన్నం రాజేష్‌, చిన్న సాల్మన్‌తో కలిసి సుశీలమ్మపై దాడి చేసి అక్కడే ఉన్న సైకిల్‌ టైర్‌తో ఆమె వీపుపై బలంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కడపలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 17న మృతి చెందింది. దీంతో ఆ ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ చలపతి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:09:33+05:30 IST