వాహనదారులకు జరిమానా
ABN , First Publish Date - 2021-05-06T04:49:42+05:30 IST
పట్టణంలో బుధవారం రాత్రి కర్ఫ్యూ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు జరిమానా విధించారు.

పులివెందుల టౌన, మే 5: పట్టణంలో బుధవారం రాత్రి కర్ఫ్యూ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు జరిమానా విధించారు. పులివెందుల డీఎస్పీ పర్యవేక్షణలో పూలంగళ్ల సర్కిల్‌లో తనిఖీ నిర్వహించారు. అనవసరంగా, కారణం లేకుండా తిరుగుతున్న వాహన చోదకులను గుర్తించి వారికి జరిమానా విధించారు. ఈ సం దర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ
ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా విధించిన కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలుపరిచేందుకు పట్టణంలో నలుమూలలా పికెట్స్, చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినట్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర వాటి కోసం ప్రజలు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల లోపు మాత్రమే రావాలన్నా రు. మిగిలిన సమయంలో అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు చిరంజీవి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.