రక్తదానంతో ప్రాణదాతలు కండి

ABN , First Publish Date - 2021-10-22T04:51:21+05:30 IST

రక్తదానంతో ప్రాణదాతలు కావాలని ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.

రక్తదానంతో ప్రాణదాతలు కండి
రక్తదానం చేస్తున్న పోలీసులు

ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు


ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 21 : రక్తదానంతో ప్రాణదాతలు కావాలని ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయ ఆవరణలో పోలీసు అధికారులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో డీఎస్పీ ప్రసాదరావు, వన్‌టౌన్‌ సీఐ ఎన్‌వి నాగరాజు, పోలీసు సిబ్బందితో పాటు స్టార్‌ ఫౌండేషన్‌ తరుపున యువకులు రక్తదానం చేశారు. అంతకు ముందు డీఎస్పీ మాట్లాడుతూ రక్తదానంపై చాలా మందిలో అపోహలు ఉన్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదన్నారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన బ్లడ్‌ యూనిట్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో బ్లడ్‌బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, స్టార్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు సిరాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-22T04:51:21+05:30 IST