రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కండి

ABN , First Publish Date - 2021-01-13T05:29:09+05:30 IST

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని న్యాయవాది రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కండి

లక్కిరెడ్డిపల్లె, జనవరి12: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని న్యాయవాది రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం లక్కిరెడ్డిపల్లె రామాలయం గుడి వద్ద రామాలయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అయోధ్యలో సుమారు 70 ఎకరాల్లో శ్రీరామ మందిరాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రతి ఒక్కరూ రామ మందిర నిర్మాణ నిధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం జనవరి 14 నుంచి 31వ తేదీ వరకు గ్రామాల్లో నిధి సమర్పణ చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:29:09+05:30 IST