‘ఓటీఎస్‌ పేరుతో పేదలపై ఆర్థిక భారం’

ABN , First Publish Date - 2021-12-08T04:55:57+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో పేద, దిగువ, మధ్యతరగతి వర్గాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించి జగనన్న శాశ్వత గృహహక్కు పథకాన్ని ఉచితంగా రిజిస్టర్‌ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

‘ఓటీఎస్‌ పేరుతో పేదలపై ఆర్థిక భారం’
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌

బద్వేలు, డిసెంబరు7: ఓటీఎస్‌ పేరుతో పేద, దిగువ, మధ్యతరగతి వర్గాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించి జగనన్న శాశ్వత గృహహక్కు పథకాన్ని ఉచితంగా రిజిస్టర్‌ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 12 ఏళ్ల అనుభవంలో ఉన్న వారికి ఇండ్లు, భూములపై సర్వహక్కులు వస్తాయని చట్టం చెబుతోంద న్నారు. పేదలు తీసుకున్న రుణాలు పదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మాఫీ చేస్తూ వస్తున్నాయన్నారు.

జగన్‌ ప్రభుత్వం అనాలోచిత సంక్షేమ పథకాల నిర్వహణకు రాష్ట్రబడ్జెట్‌ దోచిపెట్టి ఖజానా ఖాళీచేసి ప్రభుత్వ ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉందన్నారు. రెండేళ్లగా కరోనాతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు సతమతమవుతున్న పేద ప్రజలపై భారం మోపడం సబబు కాదన్నారు. పట్టణ సమస్యలపై 14న మున్సిపల్‌ కార్యాలయం వద్ద, 21న బద్వే లు తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజలు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఎం పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, మస్తాన్‌, పి.చాంద్‌బాష, వెంకటరామయ్య, రమణయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:55:57+05:30 IST