మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-08-28T05:09:49+05:30 IST

మహానందిపల్లెలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన గద్దె కిరణ్‌కుమార్‌ కుటుంబానికి క్లాస్‌-1 కాంట్రాక్టరు దేవసాని శ్రీనివాసులరెడ్డి రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

కలసపాడు, ఆగ స్టు 27 : మహానందిపల్లెలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన గద్దె కిరణ్‌కుమార్‌ కుటుంబానికి క్లాస్‌-1 కాంట్రాక్టరు దేవసాని శ్రీనివాసులరెడ్డి రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌ మృతితో ఆ కుటుంబ ఇబ్బదుల దృష్ట్యా సాయమందించామన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే దేవసాని చారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఆర్థికసాయం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, తిరుమలరెడ్డి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T05:09:49+05:30 IST