ఎయిడెడ్‌ ప్రైవేటీకరణ ఆగేవరకు పోరాటం

ABN , First Publish Date - 2021-11-10T05:00:03+05:30 IST

రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ప్రైవేటీకరణ నిలుపుదల చేసేవరకు శాంతియుతంగా ఆందోళనలు చేపడుతామని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు పేర్కొన్నారు.

ఎయిడెడ్‌  ప్రైవేటీకరణ ఆగేవరకు పోరాటం
నిరసనలో నినాదాలు చేస్తున్న విద్యార్థులు

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 9: రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ప్రైవేటీకరణ నిలుపుదల చేసేవరకు శాంతియుతంగా ఆందోళనలు చేపడుతామని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు పేర్కొన్నారు.  మంగళవారం జమ్మలమడుగులో ఎయిడెడ్‌ విద్యాసంస్థల ప్రైవేటీకరణ నిరసిస్తూ అనంతపురంలో జరిగిన ఘటనకు నిరసనగా నిరసన తెలియజేశారు. ఈ సంద ర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు వినయ్‌కుమార్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే పోలీసులచేత విద్యార్థులపై దాడులు చేయించడం దుర్మార్గపు చర్య అన్నారు. ఎన్నికలకుముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడి ్డ మేనమామలా విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి నేడు అదే విద్యార్థులను రక్తం కళ్లచూడటం దుర్మార్గమన్నారు.   ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు మానుకుని ఎయిడెడ్‌ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని వారు సూచించారు. ఈకార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

 విద్యార్థులను చావబాదడం దుర్మార్గం


అనంతపురంలో శాంతియుతంగా ఎయిడెడ్‌ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ఆపాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచేత లాఠీఛార్జి చేయించడం దుర్మార్గమని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ గజ్జల మహేశ్‌ అన్నారు. మంగళవారం జమ్మలమడుగు పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులను గాయపరిచినందుకు నిరసన తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-10T05:00:03+05:30 IST