రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అసమర్థ పాలనపై పోరాటం

ABN , First Publish Date - 2021-08-22T04:31:59+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అసమర్థత పాలనపై ప్రతీ ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అసమర్థ పాలనపై పోరాటం
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమే్‌షనాయుడు

సిద్దవటం, ఆగస్టు21 : రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అసమర్థత పాలనపై ప్రతీ ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు పిలుపునిచ్చారు. మండలంలోని భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం ఉప్పరపల్లె సాయినగర్‌ కాలనీలో శనివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు అమర్‌నాథశర్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అసమర్థపాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని తెలియజేశారు. అనంతరం ఉప్పరపల్లె 12వ చౌక దుకాణం తనిఖీ చేసి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణి అన్న యోజన పథకం కింద లబ్ధిదారులకు సక్రమంగా రేషన్‌ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్టుపోగుల ఆదినారాయణ, కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పి.పాపయ్య, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బీసీ బాలాజీ, మండల ఉపాధ్యక్షుడు మార్కండేయులు, బీజేపీ ఓబీసీ మండల అధ్యక్షుడు మస్తానయ్య,  యువ మోర్చా నాయకుడు రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-22T04:31:59+05:30 IST