ఘనంగా ఆత్మల పండగ

ABN , First Publish Date - 2021-11-03T05:15:37+05:30 IST

స్థానిక సెయింట్‌ పాల్స్‌ సీఎ్‌సఐ చర్చిలో మంగళవారం సాయంత్రం సమస్త ఆత్మల పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఆత్మల పండగ
సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న దృశ్యం

బద్వేలు, నవంబరు 2: స్థానిక సెయింట్‌ పాల్స్‌ సీఎ్‌సఐ చర్చిలో మంగళవారం సాయంత్రం  సమస్త ఆత్మల పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీనరీ చైర్మన్‌ రెవ.కె.త్యాగరాజు బాబు మాట్లాడుతూ ఏటా నవంబరు 1, 2వ తేదీల్లో తమ పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మశాంతి కోసం ఈ పండుగను నిర్వహిస్తామన్నారు. భాగంగా క్రైస్తవులంతా తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో  ప్రెస్బిటర్‌ రెవ.విద్యాకర్‌, సెక్రటరీ పి.రవి సుధాకర్‌బాబు, ట్రెజరర్‌ విజయభాను, పాస్ర్టేట్‌ కమిటి సభ్యులు  ఎడ్వర్డ్‌,  సునీల్‌కుమార్‌, మాధన విజయ్‌కుమార్‌, ప్రేమ్‌ స్వరాజ్‌, మరియమ్మ, జకరయ్య పెద్ద సంఖ్యలో సంఘస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T05:15:37+05:30 IST