వరదలో చిక్కుకొని తండ్రీ కొడుకు మృతి

ABN , First Publish Date - 2021-11-21T05:55:38+05:30 IST

వరదల్లో చిక్కుకొని ఒకే కుటుంబంలోని తండ్రీ కొడుకు మృతి చెందిన విషాధకర ఘటన చిట్వేలిలో చోటు చేసుకుంది.

వరదలో చిక్కుకొని తండ్రీ కొడుకు మృతి

చిట్వేలి, నవంబరు 20: వరదల్లో చిక్కుకొని ఒకే కుటుంబంలోని తండ్రీ కొడుకు మృతి చెందిన విషాధకర ఘటన చిట్వేలిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథ నం మేరకు... చిట్వేలి మండలం అరుంధతీవాడకు చెందిన మందా శ్రీనివాసులు(48), ఆయన కుమారుడు శ్యామ్‌ కుమార్‌ (24) ఉపాధికోసం కువైత్‌ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పేపర్లు తెచ్చుకోవడం కోసం శుక్రవారం కడపకు ప్రయాణమయ్యారు. రాజంపేట రామాపురం వద్ద వరదలో బస్సు చిక్కుకోవడంతో తండ్రీ కొడుకు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో తండ్రి శ్రీనివాసులు మృతదేహం లభించగా, వరదలో కొట్టుకుపోయిన శ్యామ్‌కుమార్‌ మృతదేమం గాలింపు చర్యలు చేపట్టగా దొరికినట్లు తెలిపారు. మృతుడు శ్రీనివాసులు గతంలో సి.కందులవారిపల్లె పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. శ్రీనివాసులుకు భార్య  కుమారుడు, కుమార్తె వున్నారు. శ్యామ్‌కుమార్‌కు భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు  ఉన్నారు. కాగా ప్రస్తుతం లక్ష్మీదేవి నాలుగు నెలల గర్భిణీ కావడంతో పలువురిని కలచివేసింది. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

Updated Date - 2021-11-21T05:55:38+05:30 IST