విద్యుత్‌షాక్‌తో రైతు మృతి
ABN , First Publish Date - 2021-11-21T05:53:09+05:30 IST
మండల పరిధిలోని గోటూరు గ్రామంలో శనివారం విద్యుత్‌షాక్‌కు గురై శ్రీనివాసులరెడ్డి (44) మృతి చెందాడు.

వల్లూరు, నవంబరు 20 : మండల పరిధిలోని గోటూరు గ్రామంలో శనివారం విద్యుత్‌షాక్‌కు గురై శ్రీనివాసులరెడ్డి (44) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరా లిలా... శ్రీనివాసులరెడ్డి తన పొలంలో వ్యవసాయ కరెంట్ మోటార్ ఆన్ చేస్తు ండగా కరెంట్ షాక్ తగిలింది. గమనించిన బంధువులు, గ్రామస్తులు హుటాహుటిన కడప రిమ్స్‌కు తరలించారు. డాక్టర్లు పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్యతో పాటు ముగ్గరు బిడ్డలు ఉన్నారని తెలిపారు. వ్యవసాయంపై అధారపడి జీవనం సాగించే కుటుంబం కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు.