రైతు దినోత్సవం కాదు... రైతు దగా దినోత్సవం
ABN , First Publish Date - 2021-07-09T04:58:05+05:30 IST
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ ర్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా జరుపుకోవడం రైతులను మోసం చేయడమే నని, ఇది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవ మని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వా హక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మండిపడ్డారు.

ఖాజీపేట, జూలై 8: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ ర్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా జరుపుకోవడం రైతులను మోసం చేయడమే నని, ఇది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవ మని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వా హక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మండిపడ్డారు. స్థానిక దుంపలగట్టులోని ఆయ న నివాస గృహం వద్ద శుక్రవారం టీడీపీ మండల అధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్‌రె డ్డితో కలిసి ఆయన రైతు దినోత్సవానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల్లో భారతదేశంలో ఏపీ మూడవస్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉండి రైతులకు తామేదో చేశామని గొప్పలు చెప్పుకుంటూ రైతాంగాన్ని పక్కదారి పట్టించడంపై ఆయన మండిపడ్డారు. చంద్రన్న ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలో సగటున 11 శాతం వృద్ధిరేటు సాధించగా.. నేడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు లు అప్పులపాలవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈక్రాప్ బుకింగ్‌లో అధికారులు నిర్లక్ష్యం కారణంగా 70 శాతం రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. చంద్రన్న ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఒకే విడతగా రూ.15 వేలు చెల్లించారన్నారు. జగన్ ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద రూ.13,500 చెల్లిస్తామని హామీ ఇచ్చి, కేవలం రూ.7,500లకే పరిమితం చేశారన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నేతలు రెడ్యం రామకృష్ణారెడ్డి, రెడ్యం ఆదినారాయణరెడ్డి, నంద్యాల సుబ్బయ్యయాదవ్, కమలాపురం గౌస్, పల్లె గంగాధర్, సారె రామానాయుడు, ఇండ్ల వెంకటరెడ్డి, రఘురామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.