వరద ప్రాంతాల్లో నేతల విస్తృత పర్యటన

ABN , First Publish Date - 2021-11-21T05:47:48+05:30 IST

రాజంపేట వరద ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించి బాధితులను ఓదార్చారు.

వరద ప్రాంతాల్లో నేతల విస్తృత పర్యటన
ఆహారాన్ని తయారు చేస్తున్న చిల్లావాండ్లపల్లె మహిళలు

సాయం చేసేందుకు ముందుకు వస్తున్న పలుపార్టీల నాయకులు ఫ దాతలు

రాజంపేట, నవంబరు20 : రాజంపేట వరద  ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించి బాధితులను ఓదార్చారు. బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌ ఆధ్వర్యంలో ఎగువ మందపల్లె బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్థాలు, గ్యాస్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు, అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమే్‌షనాయుడు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 

 జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి, ఎమ్మెల్సీ సీఆర్సీ, ఎమ్మెల్యే మేడా పరామర్శ :

జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వరద బాధితులను పరామర్శించారు. పులపత్తూరు, ఎగువమందపల్లె, గుండ్లూరు, తొగూరుపేట గ్రామాల్లో వారిరువురు పర్యటించారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆదివారం నుంచే పంపిణీ చేస్తామని తెలిపారు. జడ్పీ చైర్మన్‌ఆకేపాటి అమర్‌నాథరెడ్డి వడ్డిపల్లె, మందపల్లె హరిజనవాడ చుట్టుపక్కల గ్రామ వరద బాధితులకు భోజనాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, వైసీపీ నాయకుడు ఆకేపాటి అనిల్‌ కుమార్‌రెడ్డి, మందపల్లె, పులపత్తూరు ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, గుల్జార్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

 బాధితులను పరామర్శించిన బత్యాల..:  మందపల్లె, పులపత్తూరు, తొగూరుపేట వరద బాధితులను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయులు పరామర్శించారు.    బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. 

 జనసేన ఆధ్వర్యంలో నగదు, భోజనాలు పంపిణీ..:

రాజంపేట జనసేన పార్టీ ఇన్‌చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో గుండ్లూర్లు, మందపల్లె హరిజనవాడ, తొగూరుపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భోజన ప్యాకెట్లను, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కత్తి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. 

చిట్వేలి..:  మండల పరిధిలోని చిల్లావాండ్లపల్లె గ్రామ ప్రజలు, వరదలకు అతలాకుతలమైన నందలూరు మండలం ఆడపూరు తదితర గ్రామాలకు ఆహార పదార్థాలను అందించడానికి ముందు కొచ్చారు. గ్రామ ప్రజలు  సుమారు నాలుగు వందల ప్యాకెట్ల ఆహారం తయారు చేసి వరద బాధితులకు అందించడానికి తరలిపోయారు. 

నందలూరు..: వరదల్లో చిక్కుకున్న గొల్లపల్లె, నీలిపల్లె, నందలూరు అరుంధతివాడ, నందలూరు హరిజనవాడ, ఆడపూరు, మందపల్లె గ్రామాలలో శ్రీ సౌమ్యనాఽథస్వామి ట్రస్ట్‌ తరపున ట్రస్ట్‌ తరపున ఆ ట్రస్ట్‌ చైర్మన్‌ ఎద్దల సుబ్బరాయుడు, మాజీ ఎంపీపీ పల్లె సుబ్రహ్మణ్యం, పల్లె రెడ్డయ్య, రెడ్డి ప్రసాద్‌, రెడ్డి కృష్ణ, వైసీపీ జిల్లా మైనారిటీ నాయకుడు సయ్యద్‌ అమీర్‌, చేయూతసేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ఆహార పొట్లాలను, బ్రెడ్లు, బిస్కెట్లను అందజేశారు. వరద కారణంగా నిరాశ్రయులు అయిన బాధితులకు ఆహారం, తాగునీటిని అందించారు. 

  బియ్యం, దుస్తులు పంపిణీ చేసిన ఆకేపాటి మురళీ

రాజంపేట టౌన్‌, నవంబరు20 : వరద బాధితులకు ఆకేపాటి గోపాల్‌రెడ్డి ఫౌండేషన్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి(మురళి) ఆధ్వర్యంలో శనివారం బియ్యం, దుస్తులు పంపిణీ చేశారు. మందపల్లె హరిజనవాడ, బాలిరెడ్డిగారిపల్లె, కోపురాజుపల్లె గ్రామాల్లో వంద మూటల బియ్యాన్ని ఒక్కొక్కరికీ 50 కిలోల మూట చొప్పున అందజేశారు. పులపత్తూరు, మందపల్లె గ్రామాల్లో సుమారు 800 మందికి భోజన ఏర్పాట్లు చేయించారు. పులపత్తూరు, మందపల్లె, కోపురాజుపల్లె, బాలిరెడ్డిగారిపల్లె, తొగూరుపేట గ్రామాల్లో పర్యటించారు.  

Updated Date - 2021-11-21T05:47:48+05:30 IST