ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్లు పొడిగింపు

ABN , First Publish Date - 2021-11-27T05:05:39+05:30 IST

మండలంలోని కె.బుడుగుంటపల్లి పంచాయతీలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్‌.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎం. శ్రీలత, ఓపెన్‌ యూనివర్సిటీ సమన్వయ కర్త శ్రీధర్‌ తెలిపారు.

ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్లు పొడిగింపు

రైల్వేకోడూరు రూరల్‌, నవంబరు 26: మండలంలోని కె.బుడుగుంటపల్లి పంచాయతీలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్‌.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎం. శ్రీలత, ఓపెన్‌ యూనివర్సిటీ సమన్వయ కర్త శ్రీధర్‌ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిగ్రీ అడ్మిషన్స్‌ కోసం ఇంటర్‌ ఉత్తీర్ణత, రెండేళ్ల ఐటీఐ కోర్సు, పాలిటెక్నిక్‌ డిప్లొమా, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ అర్హత వున్నవారు మాత్రమే అర్హులు అని తెలిపారు. 200 రూపాయలు అపరాధ రుసుముతో డిసెంబరు 10వ తేదీ వరకు పొడిగించిన్నట్లు తెలిపారు.  ఇతర వివరాలకు 7382929790, 996612301 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Updated Date - 2021-11-27T05:05:39+05:30 IST