అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ ఆడ్మిషన్ల గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-10-22T04:50:19+05:30 IST

మండలంలోని కె.బుడుగుంటపల్లి పంచాయితీలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూరివర్సిటీ డిగ్రీ ఆన్‌లైన్‌ ఆడ్మిషన్ల గడువు పొడిగిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీలత తెలిపారు.

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ ఆడ్మిషన్ల గడువు పొడిగింపు

రైల్వేకోడూరు రూరల్‌, అక్టోబరు 21: మండలంలోని కె.బుడుగుంటపల్లి పంచాయితీలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూరివర్సిటీ డిగ్రీ ఆన్‌లైన్‌ ఆడ్మిషన్ల గడువు పొడిగిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీలత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె  మట్లాడుతూ డిగ్రీ ఆడ్మిషన్ల కోసం ఇంటర్‌ ఉత్తీర్ణత, రెండేళ్ల ఐటీఐ కోర్సు, పాలిటెక్నిక్‌ డిప్లోమా, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీలో ఏదైనా అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో ఆడ్మిషన్లు పొందవచ్చన్నారు. రూ.200 అపరాధ రుసుంతో ఈ నేల 31వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు రెన్యూవల్‌ ఫీజు రూ.200 అపరాధ రుసుముతో 31వ తేదీ లోపు చెల్లించవచ్చని వివరించారు. 


Updated Date - 2021-10-22T04:50:19+05:30 IST