కర్ఫ్యూను పక్కాగా అమలు చేయండి: డీఎస్పీ

ABN , First Publish Date - 2021-05-19T04:30:45+05:30 IST

కర్ఫ్యూను పక్కాగా అమలు చేయాలని రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి తెలిపారు.

కర్ఫ్యూను పక్కాగా అమలు చేయండి: డీఎస్పీ
రైల్వేకోడూరులో దుకాణాలను పరిశీలిస్తూ సూచనలిస్తున్న డీఎ్‌సపీ శివభాస్కర్‌రెడ్డి

రైల్వేకోడూరు, మే 18: కర్ఫ్యూను పక్కాగా అమలు చేయాలని రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం రైల్వేకోడూరులో ఆయన కర్ఫ్యూను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేకోడూరులో కరోనా కేసుల ఎక్కువగా ఉన్నాయని అందు వల్ల ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దుకాణా దారులు కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. కరోనా రోగులు అధికమౌతున్నారని, శానిటైజర్లు, మాస్కులు ఉపయోగించుకోవాలని తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు. లేదంటే ఇంటిలోనే ఉండి జాగ్రత్తలు పాటించి మంచి ఆహారం తీసుకోవాలన్నారు. కరోనా టీకాలు వేయించుకోవాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దుకాణా దారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. డీఎస్పీ వెంట రైల్వేకోడూరు ఎస్‌ఐ-1 పెద్ద ఓబన్న ఉన్నారు. అలాగే అనంతరాజుపేట ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కొవిడ్‌ కేంద్రంలో కరోనా బాధితులపై ఆరా తీశారు.  వారికి వసతులు ఉన్నాయా, నాణ్యత గల భోజనాలు పెడుతున్నారా, ఎంత మంది డిశ్చార్జి అయ్యారు అని ఆరా తీశారు. అదే విధంగా ఉద్యాన కాలేజీలోనే మండల పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సుల స్ట్రాంగ్‌ రూంను పరిశీలించారు.  

Updated Date - 2021-05-19T04:30:45+05:30 IST