రాష్ట్రంలో దుర్మార్గపు పాలన

ABN , First Publish Date - 2021-10-21T05:00:19+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయా లపై దాడులకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నేతలు నిరసనలు తెలి పారు.

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన
పెండ్లిమర్రిలో గృహ నిర్భందంలో ఉన్న టీడీపీ నేతలు

ఎక్కడికక్కడ టీడీపీ నేతల గృహ నిర్బంధం 

పలుచోట్ల నిరసనలు, రోడ్డుపై బైటాయింపు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయా లపై దాడులకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నేతలు నిరసనలు తెలి పారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పూర్తి వివరాలిలా...


కడప, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం రాజకీయాల్లో విషసంస్కృతికి తెరలేపిందని టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు ఆరోపించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం బందులో పాల్గొన్నందుకు అమీర్‌బాబును పోలీసులు తెల్లవారుజామునే హౌస్‌ అరెస్టు చేశారు. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఇంటి వద్దే ఆయన బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. 


మమ్మలే ్న అరెస్టు చేస్తారా

టీడీపీ జాతీయ కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్న తమను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్‌ ప్రశ్నించారు. బంద్‌లో పాల్గొనేందుకు వెళుతుండగా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. దీంతో ఇంటి వద్దే ఆయన బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. 


కమలాపురంలో: టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు నిరసనగా పార్టీ అదిష్ఠానం పిలుపు మేరకు బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం స్థానిక రైల్వేగేటు వద్ద, ప్రధాన రహదారిపై గంటపాటు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంకిరెడ్డి, వాసుదేవరెడ్డి, రాఘవరెడ్డి, యల్లారెడి ్డ, రాజారెడ్డి, జంపాల నరసింహారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, నరసింహ, శంకర్‌యాదవ్‌ పాల్గొన్నారు.


గూండాయిజాన్ని ప్రోత్సహిస్తోంది

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గూండాయిజం, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోందని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ తెలిపారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి స్థానిక గ్రామచావిడి నుంచి రైల్వేగేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథశర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడలేని సీఎంకు పరిపాలించే హక్కులేదని తక్షణమే ఆయన రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజాచారి, జనార్ధన్‌, సుధాకర్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.


చెన్నూరులో: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు అదుపు తప్పాయని మండల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బుధవారం చెన్నూరు జాతీయ రహదారిలో  మండల శాఖ అధ్యక్షుడు కె.విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఐ.శివారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మళ్ల మల్లిఖార్జునరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్లు ధర్నా చేపట్టి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు గంధం ప్రసాద్‌, ఆకుల చలపతి, కొండపేట సుధాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కొండాల చెన్నయ్య, ఆటో బాబు, రెడ్డయ్యరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, అల్లాడు రాజగోపాల్‌రెడ్డి, మంజూరు అహ్మద్‌, షబ్బీర్‌ పాల్గొన్నారు. 


వల్లూరులో: మాజీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల ప్రకారం మండల నాయకుడు నాగేశ్వర్‌రెడ్డి తన నివాసం వద్దే నిరసన తెలిపారు. వీరివెంట స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


పెండ్లిమర్రిలో: పార్టీ పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర బంద్‌ సందర్భంగా మండల టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు గంగిరెడ్డి గృహానికి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. కార్యక్రమంలో గృహ నిర్భందంలో మండల టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, అన్నమయ్య, చీమలపెంట సర్పంచ్‌ ప్రతా్‌పరెడ్డి, రామాంజనేయులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. 


వీరపునాయునిపల్లెలో: పార్టీ పిలుపు మేరకు బుధవారం మండల టీడీపీ కన్వీనర్‌ బైరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు బంద్‌ చేపట్టారు. ప్రధాన రహదారిపై అరగంట సేపు టీడీపీ జెండాలు పట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. కార్యక్రమంలో అలిదెన ఓబాయపల్లె సర్పంచు ఓబులేసు, కార్యకర్తలు బ్రహ్మానందరెడ్డి, ఓబయ్య, ఓబులేసు, చిన్న ఓబులేసు పాల్గొన్నారు.


సీకేదిన్నెలో: పార్టీ ఆదేశాల మేరకు మండలంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. మండల టీడీపీ నాయకుడు టక్కోలి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఊటుకూరు రింగ్‌ రోడ్డు సర్కిల్‌కు నేతలు చేరుకోగా సీకేదిన్నె పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి, మోహన్‌బాబు, నజీర్‌, మహేష్‌, విశ్వనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-10-21T05:00:19+05:30 IST