ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-09-03T05:01:03+05:30 IST

కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి బయటకు రావాలని ఎస్పీ అన్భురాజన్‌ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి : ఎస్పీ

కడప(క్రైం), సెప్టెంబరు 2: కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి బయటకు రావాలని ఎస్పీ అన్భురాజన్‌ పేర్కొన్నారు. గురువారం మాస్కు ధరించకుండా తిరిగే వారిని గుర్తించి 227 కేసులు నమోదు చేసి, రూ.30,360 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూ అమలులో ఉన్నందున ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఆయన సూచించారు.


ఇసుక అక్రమ రవాణా, మద్యంపై దాడులు

జిల్లాలోని ఇసుక అక్రమ రవాణా, మద్యంపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు కొనసాగించారు. గురువారం 14 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని మూడు కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజ్‌ తెలిపారు. అలాగే నాలుగు టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకుని ట్రాక్టరును స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా, నాటుసారా తయారీ, విక్రయాలు, దేశీ మద్యం అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందిస్తే  చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.  

Updated Date - 2021-09-03T05:01:03+05:30 IST