చట్టం దృష్టిలో అందరూ సమానమే: డీఎస్పీ

ABN , First Publish Date - 2021-12-09T04:33:59+05:30 IST

చట్టం దృష్టిలో అందరూ సమానమేనని రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌ పేర్కొన్నారు.

చట్టం దృష్టిలో అందరూ సమానమే: డీఎస్పీ
కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న డీఎస్పీ శ్రీధర్‌

రాయచోటి, డిసెంబరు8: చట్టం దృష్టిలో అందరూ సమానమేనని రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌ పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ కన్జూమర్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్జూమర్‌ రైట్‌ ప్రొటెక్షన్‌ ఫోరం వినియోగదారుల కోసం ఎల్లవేళలా తోడుంటూ వినియోగదారులను చైతన్యవంతులను చేయాలన్నారు. అనంతరం  ఫోరం రాష్ట్ర కన్వీనర్‌, రాయలసీమ జోన ల్‌ ప్రెసిడెంట్‌ జీ. శ్రీనివాసులు మాట్లాడుతూ అధికారుల అధికారులతో సమస్య పరిష్కా రం కాకపోతే చట్టపరంగా వెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కన్జూమర్‌ రైట్స్‌ ప్రొటెక్సన్‌ రాయచోటి అధ్యక్షుడు జామాలుల్లా, జిల్లా లీగల్‌ అడ్వైజర్‌ రవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జానకీరామ్‌, జనరల్‌సెక్రటరీ షేక్‌. అస్లాం, వ్యవసాయశాఖ సాంబమూర్తి, కమిటీ సభ్యులు న్యామత్‌, ప్రొద్దుటూరు ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T04:33:59+05:30 IST