ప్రతి మొక్కకూ రక్షణ కల్పించాలి

ABN , First Publish Date - 2021-08-22T05:06:51+05:30 IST

నా టిన ప్రతి మొక్కనూ రక్షిం చాలని గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌వీ సాగర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రతి మొక్కకూ రక్షణ కల్పించాలి
నాటిన మొక్కను పరిశీలిస్తున్న సాగర్‌కుమార్‌రెడ్డి

ఖాజీపేట, ఆగస్టు 21: నా టిన ప్రతి మొక్కనూ రక్షిం చాలని గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌వీ సాగర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జగనన్న ప చ్చతోరణంలో భాగంగా స్థానిక ఆదర్శ పాఠశాల హూనవారిపల్లెలో నాటిన మొక్కలను శనివారం ఏపీడీ సూర్యప్రకాష్‌తో కలిసి పరిశీలించిన ఆయ న మాట్లాడుతూ

పశువులు తినకుండా మొక్క చుట్టూ కంచె వేయా లన్నారు. మొక్క నాటితే సరిపోదని, దానికి నీరు పోయాలన్నారు. పర్యావరణం పెంపొందించుకునేందుకు ప్రతి ఇంటి వద్ద మొక్కలు పెంచాలన్నారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ సురేష్‌, ఏపీఓ ప్రసాద్‌, ఈసీ ప్రసాద్‌రెడ్డి, పీఏ యశోద, ఎఫ్‌ఏ ఓబులేసు పాల్గొన్నారు.

7,040 మొక్కలు నాటిన అధికారులు

చాపాడు, ఆగస్టు 21: జగనన్న పచ్చతోరణంలో భాగంగా మం డలం లోని పలు పంచాయ తీల్లో శనివారం మొత్తం 7,040 మొక్కలు నాటినట్లు ఎంపీడీఓ శ్రీధర్‌నాయుడు పేర్కొన్నారు. సీతారామాపురం, వెదురూరు, విశ్వనాధపురం, లక్ష్మీపేట, చా పాడు, అన్నవరం తదితర గ్రా మాల్లో 1050 వేపమొక్కలు, 500 మర్రి, 1520 పిల్లోఫారం, 520 బహనీయా, 1650 కాను గ, 1000 జామ, 800 అలస్టో నియా మొక్కలు నాటారు. సర్పంచులు, ఈఓపీఆర్‌డీ మార్తమ్మ, ఎం ఈఓ రవిశంకర్‌, సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.Updated Date - 2021-08-22T05:06:51+05:30 IST