ఓటరు కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోండి
ABN , First Publish Date - 2021-11-06T05:11:43+05:30 IST
ఓటు హక్కు పొందిన యువతి, యువకులు తమ కొత్త ఓటరు కార్డు కోసం బూత్ లెవల్ అధికారి వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలని రైల్వేకోడూరు ఎన్నికల అధికారి టి.అజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

రైల్వేకోడూరు రూరల్, నవంబరు 5: ఓటు హక్కు పొందిన యువతి, యువకులు తమ కొత్త ఓటరు కార్డు కోసం బూత్ లెవల్ అధికారి వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలని రైల్వేకోడూరు ఎన్నికల అధికారి టి.అజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు కోసం ఎన్నికల అధికారులతో సంప్రదించాలని కోరారు. కొత్త ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు టెన్త్ క్లాస్ మార్కులిస్ట్, రెండు ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఎన్నికల అధికారులకు ఇవ్వాలని సూచించారు. ఈ నెల 30వ తేది వర కు గడువు ఉందని తెలిపారు.