వ్యాక్సిన్‌తో ఆరోగ్యానికి భరోసా

ABN , First Publish Date - 2021-03-23T05:04:23+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆరోగ్యానికి భరోసా అని, జిల్లాలో ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పిలుపునిచ్చారు.

వ్యాక్సిన్‌తో ఆరోగ్యానికి భరోసా
కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

టీకా వేయించుకున్న డిప్యూటీ సీఎం


కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆరోగ్యానికి భరోసా అని, జిల్లాలో ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పిలుపునిచ్చారు. సోమవారం రిమ్స్‌ హాస్పిటల్‌లోని ఓపీ విభాగంలో ఆయన కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ఏడాది కొవిడ్‌ మహమ్మారితో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ ఇబ్బందిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చాకచక్యంగా ఎదుర్కొన్నాయన్నారు. 60 ఏళ్లు పైబడ్డ ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా వేయించుకోవాలని సూచించారు. అలాగే 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వయసుండి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కూడా కొవిడ్‌ టీకా వేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీకా వేయించుకున్న తరువాత ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ రావన్నారు. వ్యాక్సినేషన్‌ వేయించుకున్న తరువాత కూడా ప్రజలందరూ భౌతికదూరం, మాస్కులు ఽధరించడం లాంటివి పాటిస్తే వైరస్‌ను అరికట్టవచ్చన్నారు. కొవిడ్‌ టీకా వేసుకోవాలనుకునేవారు సచివాలయాల్లోనూ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. వీరికి ఏఎన్‌ఎం దగ్గరుండి వ్యాక్సిన్‌ వేయిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రసాదరావు, సీఎ్‌సఆర్‌ ఎంవో డాక్టర్‌ కొండయ్య, రిమ్స్‌ వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- కడప (సెవెన్‌రోడ్స్‌)


Updated Date - 2021-03-23T05:04:23+05:30 IST