ముగిసిన కాశినాయన ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2021-12-20T05:06:15+05:30 IST

అవదూత కాశిరెడ్డినాయన 26వ ఆరాధనోత్సవాలు ఆదివారంతో ముగిశాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ముగిసిన కాశినాయన ఆరాధనోత్సవాలు
కోలాటాన్ని వేస్తున్న మహిళలు

కాశినాయన డిసెంబరు 19: అవదూత కాశిరెడ్డినాయన 26వ ఆరాధనోత్సవాలు ఆదివారంతో ముగిశాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాల్లో కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాల నుంచి దాదాపు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వారు తెలి పారు. ఈ రెండు రోజులు ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, కోలాటాలతో జ్యోతి క్షేత్రం సందడిగా మారింది. భక్తులు కాశినాయన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేసి నిర్వాహకులు అందించే ఉచిత భోజనాన్ని కాశిరెడ్డి చేతి ప్రసాదంగా భావించి ఆరగించి తిరుగు ప్రయాణమయ్యారు. ఆరాధనలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రమణారెడ్డి తదితరులు కాశినాయనను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. వైద్య సిబ్బంది సేవలందించారు. పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. కాశినాయన ఆరాధన కార్యక్రమం జయప్రదం చేయడంలో సహకరించిన  ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - 2021-12-20T05:06:15+05:30 IST