నర్సరీల స్థాపనతో యువతకు ఉపాధి

ABN , First Publish Date - 2021-08-11T05:07:23+05:30 IST

నర్సరీలు స్థాపించడం ద్వారా యువత ఉపాధి పొందవచ్చని కేవీకే సమన్వయకర్త డాక్టర్‌ వీరయ్య తెలిపారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో గ్రామీణ యువతకు ఉద్యాన నర్సరీల స్థాపన, నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

నర్సరీల స్థాపనతో యువతకు ఉపాధి

సీకేదిన్నె, ఆగస్టు 10: నర్సరీలు స్థాపించడం ద్వారా యువత ఉపాధి పొందవచ్చని కేవీకే సమన్వయకర్త డాక్టర్‌ వీరయ్య తెలిపారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో గ్రామీణ యువతకు ఉద్యాన నర్సరీల స్థాపన, నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకుని ఖాళీగా ఉన్న గ్రామీణ యువత ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూడకుండా స్వతహాగా ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలన్నారు. ఉద్యానశాఖ శాస్త్రవేత్త నాగిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, పూలమొక్కల నారుకు ఏడాది పొడవునా డిమాండ్‌ ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేసుకుంటే ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పద్మోదయ, శాస్త్రవేత్తలు రామలక్ష్మి, శ్రీనివాసులు, శిల్పకళ, తేజ, ప్రశాంతి, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-11T05:07:23+05:30 IST