న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2021-12-10T04:32:15+05:30 IST

ఏపీజేఏసీ, అమరావతి జేఏసీ ఐక్యవేదిక ఉమ్మడి కార్యచరణలో భాగంగా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గురువారం రాజంపేట ఆర్‌అండ్‌బీ అతిఽథి భవనం ప్రాంగణంలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల నిరసన
లక్కిరెడ్డిపల్లె తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

రాజంపేట టౌన్‌, డిసెంబరు 9 : ఏపీజేఏసీ, అమరావతి జేఏసీ ఐక్యవేదిక ఉమ్మడి కార్యచరణలో భాగంగా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గురువారం రాజంపేట ఆర్‌అండ్‌బీ అతిఽథి భవనం ప్రాంగణంలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. రహదారులు, భవనాల శాఖ, ఇరిగేషన్‌ శాఖ, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.   ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్‌ ఎస్‌.వెంకటరమణ, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే రాజంపేట ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీ పీటీడీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిపో సెక్రటరీ బీసీ శేఖర్‌, ఎన్‌ఎంయుఏ సెక్రటరీ రమణ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు చల్లా వెంకటేష్‌, పి.ఎం.రత్నం, చిన్నోడు, సీఎం కృష్ణ, మౌలా, రాజాశెట్టి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య సిబ్బంది జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 

 

లక్కిరెడ్డిపల్లెలో....

లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు 9: రాష్ట్ర ఉమ్మడి జేఏసీల పిలుపుమేరకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గురువారం మూడవరోజు లక్కిరెడ్డిపల్లె యూనిట్‌ పరిధిలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి అన్నిశాఖల ఉద్యోగులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్జీవో ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ మాట్లాడుతూ పీఆర్‌సీ అమలు చేసి పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల చేయాలని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, సీపీఎస్‌ రద్దు చేసి హెల్త్‌కార్డులు ఇవ్వాలన్నారు.  కార్యక్రమంలో జేఏసీ చైర్మన్‌ బలరామరాజు, జేఏసీ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రాజేంద్రరాజు, విశ్వనాధ, సాయిపీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-10T04:32:15+05:30 IST