ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-10-21T04:52:16+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ప్రొద్దుటూరు తాలూకా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు టౌన్, అక్టోబరు 20: ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ప్రొద్దుటూరు తాలూకా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ఎన్జీవో భవన్‌లో అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు దేవమణి పదోన్నతిపై జమ్మలమడుగుకు బదిలీ కావడంతో ఆమెను ఘనంగా సత్కరించారు. అనంతరం అసోసియేషన్ జిల్లా పరిశీలకులు నిత్యపూజయ్య ఆద్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న ప్రమీలను కోఆప్షన్ ద్వారా ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షు డు శ్రీనివాసులు, సహ అధ్యక్షుడు సదాశివయ్య, కోశాధికారి శివరాం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.