ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-08T04:58:13+05:30 IST

పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ ఆర్‌.జీవన్‌ చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ పేర్కొన్నారు.

ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
నల్లబ్యాడ్జీలతో విఽధులక హాజరైన ఉద్యోగులు

ఏపీ ఎన్జీవో సంఘం నేతల డిమాండ్‌


కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 7: పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ ఆర్‌.జీవన్‌ చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పీఆర్సీ, డీఏలు, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్ర ఉమ్మడి జేఏసీల పిలుపు మేరకు కలెక్టరేట్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన చేట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విషయంలో తాత్సారం చేయడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వంపై వత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగా ఈ నిరసనలకు దిగామన్నారు. జిల్లాలోని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుపతిలో ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, ఇతర సమస్యలు 10 రోజుల్లో పరిష్కరిస్తామన్నారని, ఆ రోజుకోసం ఎంతో ఆశతో ఉన్నామన్నారు. ఈనెల 21 వరకు దశలవారీగా శాంతియుతంగా నిరస కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎండీ అలీఖాన్‌, ఏపీ ఎన్జీవో సంఘ ట్రెజరర్‌ నిత్య పూజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:58:13+05:30 IST