ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-02-02T05:01:41+05:30 IST

జమ్మలమడుగు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, వైసీపీ నాయకుడు సురే్‌షబాబులు పేర్కొన్నారు.

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సురే్‌షబాబు

జమ్మలమడుగు రూరల్‌, ఫిబ్రవరి 1: జమ్మలమడుగు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, వైసీపీ నాయకుడు సురే్‌షబాబులు పేర్కొన్నారు. సోమవారం వారు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమే్‌షపై వారు విమర్శలు చేశారు.  జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంశొంచిన బీజేపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వారు ఆరోపించా రు. జిల్లాలో టీడీపీ, బీజేపీ తమకు పోటీనే కాదన్నారు. ప్రజలు తమవైపే ఉన్నారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, కొమెర్ల జగదీశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T05:01:41+05:30 IST