ఉపాధి అవకాశాల మెరుగుకు కృషి

ABN , First Publish Date - 2021-12-31T05:06:37+05:30 IST

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్‌ కల్లూరు చంద్ర ఓబుళరెడ్డి పేర్కొన్నారు.

ఉపాధి అవకాశాల మెరుగుకు కృషి
ఏపీఐఐసీ చైర్మన్‌ చంద్ర ఓబుళరెడ్డిని గజమాలతో సత్కరిస్తున్న అధికారులు, నాయకులు

వేంపల్లె, డిసెంబరు 30: నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్‌ కల్లూరు చంద్ర ఓబుళరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెకు చెందిన ఆయన ఏపీఐఐసీ డైరెక్టర్‌గా విజయవాడలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనను వేంపల్లె వైసీపీ నేతలు గజమాల శాలువతో సత్కరించారు. అనంతరం చంద్ర ఓబుళరెడ్డి మాట్లా డుతూ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని, తద్వారా ఉద్యోగాల సంఖ్య పెంచేందుకు పని చేస్తామన్నారు. పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినా్‌షరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. 

 

Updated Date - 2021-12-31T05:06:37+05:30 IST