విలువలతో కూడిన విద్యనందించాలి

ABN , First Publish Date - 2021-02-06T04:58:15+05:30 IST

విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించి వారి భవిష్యతకు బంగారు బాటలు వేయాలని జీసీడీఓ మాధురి ఉపా ధ్యాయులకు సూచించారు.

విలువలతో కూడిన విద్యనందించాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న జీసీడీఓ మాధురి

కస్తూర్భా గాంధీ పాఠశాల పరిశీలనలో రాష్ట్ర జీసీడీఓ

వేముల, ఫిబ్రవరి 5: విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించి వారి భవిష్యతకు బంగారు బాటలు వేయాలని జీసీడీఓ మాధురి ఉపా ధ్యాయులకు సూచించారు. శుక్రవా రం వేముల కస్తూర్భా గాంధీ బాలిక ల విద్యాలయంలో బయోమెట్రిక్‌ హా జరు, రిజిస్టర్లు తనిఖీ చేశారు. బాలి కల మరుగుదొడ్లు, వంటశాల పరిస రాలను, ఆహారాన్ని పరిశీలించారు. 

చక్రాయపేట, ఫిబ్రవరి 5: విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించాలని జిల్లా అకడమిక్‌ అధికారి ధన లక్ష్మి ఉపాధ్యాయులను కోరారు. కస్తూర్భా గాంధీ బా లికల పాఠశాలను తనిఖీ చేసిన ఆమె మాట్లాడుతూ పిల్లలకు విలువలతో కూడిన విద్యను అభ్యసింపచే యాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. విద్యాశాఖాధికారి రవీంద్రనాయక్‌, సీఆర్పీలు,  ప్రిన్సిపాల్‌, స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:58:15+05:30 IST