తొలిరోజు నామినేషన్లు ప్రశాంతం

ABN , First Publish Date - 2021-02-07T04:49:13+05:30 IST

రాజంపేట మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి రోజు నామినేషన్లు ఒక మోస్తారుగా దాఖలయ్యాయి.

తొలిరోజు నామినేషన్లు ప్రశాంతం
సుండుపల్లెలో నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీఎస్పీ వాసుదేవన్‌

రాజంపేట టౌన్‌, ఫిబ్రవరి6 : రాజంపేట మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి రోజు నామినేషన్లు ఒక మోస్తారుగా దాఖలయ్యాయి. సర్పంచ్‌ స్థానానికి 21 నామినేషన్లు, వార్డుకు 69నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి రెడ్డయ్య తెలిపారు. అప్పారాజుపేటలో సర్పంచ్‌ స్థానానికి రెండు నామినేషన్లు, వార్డుకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. చవనవారిపల్లెలో సర్పంచ్‌స్థానానికి 3, వార్డులకు ఐదు, గుండ్లూరులో సర్పంచ్‌కు రెండు, హస్తవరంలో సర్పంచ్‌కు ఒకటి, వార్డులకు 12, మందపల్లెలో సర్పంచ్‌కు 1, వార్డులకు 9, పెద్దకారంపల్లెలో సర్పంచ్‌కు రెండు, వార్డులకు 6, పోలిలో సర్పంచ్‌కు రెండు, వార్డుకు మూడు, పులపత్తూరులో సర్పంచ్‌కు ఒకటి, సీతారాంపురంలో సర్పంచ్‌కు ఒకటి, వార్డులకు నాలుగు, తాళ్లపాకలో సర్పంచ్‌కు ఒకటి, ఊటుకూరులో సర్పంచ్‌కు ఒకటి, వార్డులకు ఒకటి, వరదయ్యగారిపల్లెలో సర్పంచ్‌కు మూడు, వార్డులకు ఆరు, బ్రాహ్మణపల్లెలో సర్పంచ్‌కు ఒకటి దాఖలైనట్లు తెలిపారు.

సుండుపల్లె..:

ఎన్నికల్లో భాగంగా మొదటిరోజు శనివారం  సర్పంచ్‌ అభ్యర్థులు గ్రామ సచివాలయాల్లో  నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో భాగంగా జీ.రెడ్డివారిపల్లె పంచాయతీలో సర్పంచ్‌ అభ్యర్థులుగా 2, ముడుంపాడు 1, మాచిరెడ్డిగారిపల్లె 1, రాయవరం 1, మడితాడు 1, పొలిమేరపల్లె 3, చిన్నగొల్లపల్లె 1 చొప్పున 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వార్డులకు తిమ్మసముద్రం 1, బాగంపల్లె 2, మడితాడు 1 చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో రామచంద్రారెడ్డి తెలిపారు.  సచివాలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ వాసుదేవన్‌, సీఐ లింగప్ప, ఎస్‌ఐ భక్తవత్సలం బందోబస్తు ఏర్పాటు చే శారు. 

వీరబల్లి..: 

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మండలంలో 12 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొదటిరోజు 16 సర్పంచ్‌ స్థానాలకు, 27 వార్డు మెంబర్లకు నామినేషన్‌ దాఖలు చేయడం జరిగింది. గుర్రప్పగారిపల్లె పంచాయతీలో సర్పంచ్‌ 5, వార్డు 2, సానిపాయి సర్పంచ్‌ 3, వార్డుకు 3, ఓదివీడు సర్పంచ్‌ 2, వార్డు 6, పెద్దివీడు సర్పంచ్‌ 1, వార్డుకు 4, సోమవరం వార్డుకు 12, దిగువరాచపల్లె సర్పంచ్‌ 2, గడికోట సర్పంచ్‌ 3 స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.  12 పంచాయతీలకు గానూ నామినేషన్ల ప్రక్రియ 4 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 

రైల్వేకోడూరులో...

రైల్వేకోడూరు రూరల్‌, ఫిబ్రవరి 6: మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ  రైల్వేకోడూరు మండలంలో శనివారం మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. రైల్వేకోడూరు సీఐ ఆవుల ఆనందరవు నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మండలంలోని 21 పంచాయతీలోని 11 క్లస్టర్లలో సర్పంచ్‌ అభ్యర్థులుగా 38 మంది వార్డు అభ్యర్థులుగా 55 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పట్టణంలోని పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్‌ అభ్యర్థులు మధ్యాహ్నం ఆలస్యం రావడంతో రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. మండలంలోని మైసూరివారిపల్లె పంచాయతీలో 7 గురు సర్పంచ్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరాజుపేట, మాధవరంపోడు పంచాయతీలో 5, బొజ్జవారిపల్లిలో 4, కె.బుడుగుంటపల్లి, తిమ్మిశెట్టిపల్లిలో, వెంకటరెడ్డిపల్లిలో 3,రాఘవరాజపురం, ఓబనపల్లి 2, చియ్యవరం,కోడూరు, శెట్టిగుంట, వి.వి.కండ్రిక పంచాయతీలో 1, నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి పఠాన్‌ మహబుబ్‌ ఖాన్‌ తెలిపారు.

నందలూరు..:

మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు శనివారం  మొదటి రోజు నిర్వహించిన నామినేషన్లు ప్రశాంతంగా జరిగినట్లు ఎంపీడీవో సౌభాగ్యమ్మ తెలిపారు. మండలంలో 13 నామినేషన్లు సర్పంచ్‌స్థానానికి, 17 నామినేషన్లు వార్డు మెంబర్లకు వేయడం జరిగింది. నందలూరు పంచాయతీకి సర్పంచ్‌కి 2, వార్డు మెంబర్లు 9, నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ 2, వార్డు మెంబర్లు 1, టి.వి.పురంలో సర్పంచ్‌కు 1, టంగుటూరులో సర్పంచ్‌కు 5, వార్డు మెంబర్లు 6, మదనమోహనపురం సర్పంచ్‌కు 3, ఒకటి వార్డు మెంబర్‌కు నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. పాటూరు, నల్లతిమ్మయ్యగారిపల్లె, పొత్తపి, ఆడపూరు, ఎర్రజెరువుపల్లె, లేబాక గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని తెలిపా రు. అన్ని నామినేషన్‌ కేంద్రాల వద్ద ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కడప ట్రాఫిక్‌ డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, తహసీల్దారు శ్రీరాములనాయక్‌ నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. 

సిద్దవటం..:

సిద్దవటం మండలంలో శనివారం నామినేషన్‌ ప్రక్రియ కొనసాగింది. పెద్దపల్లె పంచాయతీలో సర్పంచ్‌కు ఒకరు, సిద్దవటంలో వార్డు మెంబర్లుగా ఇద్దరు, బొగ్గిడివారిపల్లె సర్పంచ్‌కు ఇద్దరు, వార్డు మెంబర్‌కు ఇద్దరు, శాఖరాజుపల్లె సర్పంచ్‌కుముగ్గురు, వార్డు మెంబర్‌కు ఐదుగురు, ఉప్పరపల్లె సర్పంచ్‌కు ఇద్దరు, మాచుపల్లె సర్పంచ్‌కు ముగ్గురు, వార్డుమెంబర్‌లుగా ఐదుగురు, నేకనాపురంలో సర్పంచ్‌కు ఒకటి, టక్కోలిలో సర్పంచ్‌కు ముగ్గురు, ఏడుగురు వార్డుమెంబర్లకు, జ్యోతిగ్రామంలో సర్పంచ్‌కు ముగ్గురు, వార్డుకు ఐదుగురు, పొన్నవోలు సర్పంచ్‌కు రెండు, మాధవరం-1 సర్పంచ్‌కు రెండు, వార్డు మెంబర్‌కు ఒకటి నామినేషన్‌లు నమోదయ్యాయి. సిద్దవటం మండలం జ్యోతి గ్రామ పంచాయతీ నామినేషన్‌ క్లస్టర్‌ను ఎస్‌ఐ రమే్‌షబాబు పరిశీలించారు.

చిట్వేలి..:

మండల పరిధిలోని 21  మండలంలో 21పంచాయతీలలో చెర్లోపల్లె, సి.ఎం.రాచపల్లె, కంపసముద్రం, కె.వి.ఆర్‌.పురం, మార్గోపల్లె, నాగవరం, నక్కలపల్లె పంచాయతీలలో ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా పంచాయతీలలో 21 మంది సర్పంచ్‌ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయగా మండలంలో 200 వార్డు సభ్యులకు గానూ 74మంది వార్డు సభ్యులు నామినేషన్‌ దాఖలు అయినట్లు ఎన్నికల సహాయ అధికారి శ్యామ్‌సన్‌ తెలిపారు.  నామినేషన్ల కేంద్రాలను తహసీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డి, పంచాయతీ విస్తరణాధికారి పులిరాంసింగ్‌, రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, రైల్వేకోడూరు సీఐ ఆనందరావు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు.

పుల్లంపేట..:

మండలంలో సర్పంచ్‌ స్థానాలకు 16మంది నామినేషన్లు వేయగా వార్డులకు 21నామినేషన్లు దాఖలు అయినట్లు ఎంపీడీవో శివప్రసాద్‌వర్మ తెలిపారు. మండలంలో డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, సీఐ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అలాగే స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇన్‌స్పెక్టర్‌ శివసాగర్‌ అనంతయ్యగారిపల్లె, పుల్లంపేట, అప్పయ్యరాజుపేట, వత్తలూరు నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. అలాగే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు.

ఒంటిమిట్ట..: 

మండల వ్యాప్తంగా 27 మంది సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు మెంబర్‌ స్థానాలకు 37 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారని ఎంపీడీవో కృష్ణయ్య తెలి పారు. ఒంటిమిట్ట సర్పంచ్‌ స్థానానికి ఏడుగురు నామినేషన్‌ దాఖలు చేయగా వార్డులకు పది మంది నామినేషన్‌ దాఖలు చేశారు. చింతరాజుపల్లెలో ఒకటి, మంటపంపల్లె రెండు, కొండమాచుపల్లె ఒకటి, గంగపేరూరులో ఏడు, పెన్నపేరూరులో రెండు, గొల్లపల్లెలో ఒకటి, ఒంటిమిట్టలో ఏడు, కొత్తమాధవరంలో మూడు, రాచగుడిపల్లెలో మూడు సర్పంచ్‌స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు.  

నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన పోలింగ్‌ అబ్జర్వర్‌

కాగా  ఒంటిమిట్ట, మంటపంపల్లె, నామినేషన్‌ కేంద్రాలను నామినేషన్‌ కేంద్రాలను పోలింగ్‌ అబ్జర్వర్‌ రంజిత్‌బాషా పరిశీలించారు. వీరివెంట తహసీల్దారు విజయకుమారి, ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, పోలింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T04:49:13+05:30 IST