కరువు మండలాన్ని ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-07-25T04:49:22+05:30 IST

జిల్లాలో వెను కబడిన ప్రాంతం, రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రాంతమైన చక్రాయపేట మండలాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కార్యవర్గం తీర్మానించిం ది.

కరువు మండలాన్ని ఆదుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న రామచంద్రారెడ్డి

చక్రాయపేట, జూలై 23: జిల్లాలో వెను కబడిన ప్రాంతం, రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రాంతమైన చక్రాయపేట మండలాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కార్యవర్గం తీర్మానించిం ది. శనివారం నాగులగుట్టపల్లె జన జా గృతి గ్రంథాలయంలో నిర్వహించిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం లో ఆయన మాట్లాడుతూ కరువు రైతు లను ఆదుకునేందుకు, తాగు, సాగు నీరు కోసం 2001 నుంచి 2019 వరకు కృష్ణాజలాల కోసం బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్రలు, ధర్నాలు చేశామన్నారు.

ఈ పోరాట ఫలితంగా జూలై 4వ తేదీ కాలేటి వాగు వద్ద భూమిపూజ చేయడం హర్షణీయ మన్నారు. రెవెన్యూ సేవలు అందడం లేదని, పట్టాదారు పాసుబుక్కులు, భూముల నమో దులో రెవెన్యూ శాఖ జాప్యం చేస్తోందని, అవినీతి, నిర్లక్ష్యంతో కూరుకుపోయిందని దీని వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతు న్నారని ఆరోపించారు. ఈ సమస్యలను వెం టనే పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశా రు. 

మండలంలో సీజనల్‌ వైరల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయని, అన్ని పంచాయతీల్లో పారిశుధ్యం, శుభ్రత కోసం సిబ్బందిని నియ మించాలని కోరారు.  చక్రాయపేట, నాగుల గుట్టపల్లె సంతల్లో పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. బీజేపీ నే తలు వేమారెడ్డి, భువనగిరి చక్రపాణి, పూల సుబ్బయ్య, మునిరెడ్డి, కేఆర్‌రెడ్డి, వీరాంజనే యులు, రఘురామయ్య పాల్గొన్నారు.

‘సోమశిల ఎత్తిపోతల’ను చేపట్టాలి

గోపవరం, జూలై 24: బద్వేలు ప్రాంత వరప్రసాదిని సోమశిల వెనుక జలాల ఎత్తిపోత ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని బీజేపీ గోపవరం మండల కార్యవర్గం డిమాండ్‌ చేసింది. రాచాయిపేటలో నిర్వ హించిన కార్యవర్గ సమావేశంలో బీజేపీ నేత లు మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చిన ని ధులు జగనన్న పథకాలకు పంచి పెడుతూ ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలను ఎనిమిది వారాలుగా ఇవ్వడంలేదన్నా రు.

సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో సోమశిల ఎత్తిపోతల పథకం నుంచి ఐదు టీఎంసీల నీటిని బద్వేలు పెద్ద చెరువుకు తరలించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామ లం చేస్తామని ఇచ్చిన హామీని ఇంత వరకు ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. అభివృద్ధిపై కార్యాచరణ రూపొందించి సోమవారం నుంచి అధికారులను కలిసి అభివృద్ధిపై ప్రశ్నిస్తా మన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండ ల అధ్యక్షుడు హరికిరణ్‌రెడ్డి, నేతలు వ నం నరసింహులు, సుధాకర్‌రెడ్డి, మల్లెం కొండరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

గ్రామ సమస్యలపై దృష్టి...

బ్రహ్మంగారిమఠం, జూలై 24: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం సూచిస్తే ప్రజల మనస్సు  బీజేపీ వైపు ఉంటుందని,  మఠం ఇన్‌ఛార్జి మిట్టా చంద్రశేఖర్‌రెడ్డి అన్నా రు. మండల కార్యవర్గ సమావేశంలో ఆయన కార్యకర్తలకు పలు సూచనలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారుకు వినతి పత్రాన్ని అం దజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్య క్షుడు చంద్ర ఓబుళరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, మైదుకూరు అసెం బ్లీ మాజీ కన్వీనర్‌ శేఖర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-07-25T04:49:22+05:30 IST